‘బండ్లా’ బ్లేడ్ తెమ్మంటావా?

-


నోటి దూలతో బండ్ల గణేష్ కి కొత్త చిక్కు వచ్చి పడింది… ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ..పార్టీకి మద్దతుగా ఓ టీవీ ఛానెల్ లో తనకు ఇష్ట వచ్చినట్లు ఛాలెంజ్ లు విసిరారు.. ‘డిసెంబర్ 11.. ఉదయం 11 గంటల తరువాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు షార్ప్‌గా పీక తెగే 7’O Clock బ్లేడ్ తీసుకుని రండి.. ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం’ అంటూ సినిమా డైలాగులతో కూడిన పంచ్ లు వేసిన బండ్లకు నెటిజన్లు చుక్కులు చూపిస్తున్నారు..


తెలంగాణ ప్రజానికం తెరాసకు బ్రహ్మ రథం పట్టడంతో ప్రస్తుతం 95 స్థానాల్లో విజయం దిశగా ఆధిక్యత కొనసాగుతుండగా కాంగ్రెస్ 17 స్థానాల్లోనే తన ప్రతాపాన్ని చాటుతోంది. దీంతో పాట మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెమటలు పట్టించే విధంగా ఫలితాలు వస్తున్నాయి.. ఇప్పటికే జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు… రాజకీయాలు చకచకా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం అనే క్వచ్ఛనే లేదు. జనం నాడి మాకు తెలుసు. జనం మాకోసం ఎదురు చూస్తున్నారు. బల్ల గుద్ది చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది…అంటూ పిచ్చిపిచ్చిగా వాగిన బండ్ల గణేష్ కి బ్లేడ్ ఎక్కడుందో తెలుసా.. వీలైతే మమ్మల్ని తెమ్మంటారా ?అంటూ..పలు రకాల కామెంట్స్ తో నెటిజన్లు బండ్ల నోటి దూలకి కౌంటర్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news