రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి టిడిపి మరియు జనసేన కలయికను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు . జనసేన మరియు తెలుగుదేశం పార్టీలను అనురాదొక్కడానికి వైసిపి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిందని అన్నాడు. ఇవ్వగలం నవ శకం సభలో మాట్లాడుతూ చంద్రబాబు గారు తన అనుభవంతో టిడిపి పార్టీని కాపాడుకుంటూ వచ్చారని అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ రాష్ట్రం బాగుండాలని మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందడుగు వేశాడు అని చెప్పాడు.
జగన్ ప్రభుత్వం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలను పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని ఆరోపించాడు. 2014లో రాష్ట్రాన్ని బాగు చేయాలని జనసేన మరియు టిడిపి ఎంతో పరితపించిందని కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రా భవిష్యత్తుని వెనక్కి నెట్టి వేసిందని అన్నాడు. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుపరిపాలన పాలనని అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.