బ్రేక్ ఈవెన్ సాదించేసిన సలార్.. ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరో ప్రభాస్..

-

Salaar : ప్రశాంత్ నేను దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్ ప్రభాస్ అభిమానులను చాలా ఏళ్ళ తరువాత కాలర్ ఎగరేసేలా చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రభాస్ నుంచి రెబల్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్ ఈ మూవీలో కనిపించడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది.

మొదటి రోజే ఈ సినిమా ప్రపచవ్యాప్తంగా ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక మొదటి వీకెండ్ పూర్తి చేసుకునేప్పటికీ 402 కోట్ల గ్రాస్ ని రాబట్టింది .అలాగే ఫస్ట్ వీక్ రూ.550 కోట్లు, సెకండ్ వీక్ దాదాపు 660 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ 700 కోట్ల మార్క్ ని దాటేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తెలిపారు.కాగా ఈ సినిమా కి ప్రపంచవ్యాప్తమగా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టడంతో సలార్ బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news