కరోనా వైరస్ దెబ్బకు దేశంలో అన్ని వ్యవస్థలు కుప్ప కూలుతున్నాయి. ఎక్కడిక్కడ ప్రజలు రోగం తో భయపడుతుంటే దేశ ఆర్ధిక వ్యవస్థ నెత్తిన కూర్చుంది కరోనా. కరోనా వైరస్ డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. తొలిసారి 75 మార్క్ ను తాకింది రూపాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమై… బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్ట పోయింది.
ఆ తర్వాత మరింతగా బలహీనపడింది. మధ్యాహ్నం 12.10 ప్రాంతంలో ఒక్కసారే 81 పైసలు పతనమైన రూపాయి… 75.08 వద్ద కనిష్టం నమోదైంది. చరిత్రలో మొదటి సారి ఇలా నమోదు అయింది. ఇప్పటికే దేశంలో అన్ని వ్యవస్థలు కుప్ప కూలిపోతున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. డాలరు విలువ పెరగడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లు కూడా పతనం అవుతున్నాయి.
ఇది పక్కన పెడితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 100ను సైతం అధిగమించింది. దేశీయ భారీగా కరెన్సీ బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే బంగారం అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. ఈ వైరస్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం కూడా భారీగా దెబ్బ తినే అవకాశాలు కనపడుతున్నాయి.