భావోద్వేగాలతోనూ రాజకీయాలు చేయడం తగదు… హరీష్ రావు 

-

 తెరాస పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని కొంద‌రు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయాల్లో స్వర్థప్రయోజనాల కోసం ప్రతీ విషయాన్ని వక్రీకరించి చూడటం మంచిది కాదన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్ర‌హీంపూర్ స‌భ‌లో జోరువాన‌లోనూ త‌న‌కు వ‌చ్చిన ప్ర‌జాద‌ర‌ణ చూసి భావోద్వేగానికి గురై మాట్లాడిన..  ‘ప్ర‌జాభిమానం ఉన్న‌ప్పుడే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌న్న’ త‌న వ్యాఖ్య‌లను ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం మంచిది కాదన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేద‌న్నారు.

భావోద్వేగాల‌తో రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని ప్ర‌తిప‌క్షాల‌కు చుర‌క‌లంటించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు తెరాసను ఎలా ఎదుర్కోవాలే తెలియక అనవసర వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరువు తీసుకోవద్దు అంటూ హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version