తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు భూమి పూజ చేసి ప్రారంభించారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వి.కె సింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రఘునందన్ రావు, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.
జాతికి అంకితమిచ్చిన ప్రాజెక్టులు.
1) NH-161పై సంగారెడ్డి-నాందేడ్-అకోలా కారిడార్ పై రాంసాన్ పల్లె నుంచి మంగ్లూరు వరకు 4 వరసల రహదారి (పొడవు 47 కి.మీ, రూ.1614 కోట్ల వ్యయం)
2) NH-161పై సంగారెడ్డి-నాందేడ్-అకోలా కారిడార్ పై మంగ్లూరు నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు 4 వరసల రహదారి (పొడవు 49 కి.మీ, రూ.1312 కోట్ల వ్యయం)
👉శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు
1) NH-44పై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో కల్కల్లు నుంచి గుండ్లపోచంపల్లి వరకు 6 వరసల రహదారి (పొడవు 17 కి.మీ, రూ.955.50 కోట్ల వ్యయం)
2) NH-44పై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో గుండ్లపోచంపల్లి నుంచి బోయిన్ పల్లి వరకు 6 వరసల రహదారి (పొడవు 10 కి.మీ, రూ.521.50 కోట్ల వ్యయం)
3) NH-44పై హైదరాబాద్-బెంగళూరు సెక్షన్ లో తొండుపల్లి నుంచి కొత్తూరు వరకు 6 వరసల రహదారి (పొడవు 12 కి.మీ, రూ.541.60 కోట్ల వ్యయం)
4) NH-163 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (TSPA జంక్షన్) నుంచి మన్నెగూడ వరకు 4 వరసల రహదారి (పొడవు 46 కి.మీ, రూ.928.41 కోట్ల వ్యయం)
5) NH-365Bపై దుద్దెడ నుంచి జనగామ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 45.57 కి.మీ, రూ.423.48 కోట్ల వ్యయం)
6) NH-930Pపై వలిగొండ నుంచి తొర్రూరు వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 69.12 కి.మీ, రూ.549.28 కోట్ల వ్యయం)
7) NH-65పై LBనగర్-మల్కాపూర్ సెక్షన్ 6 వరసల రహదారి (పొడవు 22.50 కి.మీ, రూ.545.11 కోట్ల వ్యయం)
8) NH-163పై హనుమకొండ నుంచి ములుగు సెక్షన్ 6 వరసల రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 69.12 కి.మీ, రూ.549.28 కోట్ల వ్యయం)
9) NH-163 హైదరాబాద్ నుంచి భూపాలపట్నం సెక్షన్ పై 6 వరసల రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 4.40 కి.మీ, రూ.48.32 కోట్ల వ్యయం)
10) NH-65పై హైదరాబాద్-పూణె సెక్షన్ పై BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం (పొడవు 1.65 కి.మీ, రూ.96.51 కోట్ల వ్యయం)