మద్దెల చెరువు సూరి హత్యకేసులో నేడే తుది తీర్పు…

-


తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన … రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెరువు సూరి హత్యకేసులో ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. 2011, జనవరి 4న సూరి అనుచరుడు భానుకిరణ్ చేతిలో ఆయన హత్యకు గురయ్యాడు. సూరితో పాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసుఫ్‌గూడ సమీప ప్రాంతంలో తుపాకీతో కాల్చి ఆయన్ని చంపారు. దీంతో ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. కారులో ప్రధాన సాక్షిగా ఉన్న కారు డ్రైవర్ మధు కోర్టులో వాంగ్మూలం ఇస్తూ..సూరిని భానుకిరణ్ హత్య చేశాడని పేర్కొన్నాడు. 

కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాటి ప్రభుత్వం దీనిపై సీఐడీతో విచారణ చేపట్టింది… 2012, ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం భానుకిరణ్‌పై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం నిందితుడు ప్రయత్నించినా దొరకలేదు. ఆరేళ్లుగా విచారణ జరిపిన కోర్టు నేడు తుదితీర్పు వెలువరించనుంది. రవి హత్య కేసులో తెర వెనుకఉన్న వారు తప్పించుకునేందుకే సూరిని హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా ..నేడు న్యాయస్థానం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news