ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 9 మంది మృతిచెందిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే మద్య విమోచన కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కురిచేడు మరణాలపై సమగ్ర విచారణ చేసి కారణాలు వెలికి తీయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శానిటైజర్ తాగి ప్రకాశం జిల్లా కురిచేడులో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందన్నారు. నాటుసారాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. ఇన్ని జరుగుతుంటే మద్య విమోజన కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
మద్యనిషేధంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ ఘటనతో అర్థం అవుతోందంటూ విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో డీ-ఎడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికి 13 మందికి చేరుకుంది..ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతి.పామూరులో శానిటైజర్ తాగి షేక్ ఖాదర్, మల్లికార్జున్, రోశయ్య అనే వ్యక్తులు మృతి