తెలంగాణలో తెరాస ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తెదేపా, తెజస తో సహా కొన్ని పార్టీలన్నీ ఏకమై మహాకూటిమిగా ఏర్పడటం పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని స్పందించారు. తాము మహాకూటమిలో చేరే ఆలోచన లేదని..అసలు మహాకూటమి అనేది అర్థం లేని ఆలోచన అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపా, తెరాసకి ప్రత్యామ్నాయంగా జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో చర్చలు జరిపామన్నారు. త్వరలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని పేర్కొన్నారు.