మహారాష్ట్రకు టాటా సంస్థ భారీ సాయం…!

-

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ అక్కడి సర్కార్ లాక్ డౌన్ ని కాస్త కఠినం గానే అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడిలో ఏ రాష్ట్రం తీసుకోలేని విధంగా చర్యలు తీసుకుంది మహారాష్ట్ర.

ఇక అది అలా ఉంటే ఇప్పుడు ఆ రాష్ట్రానికి సహాయం చేయడానికి గానూ పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. టాటా సన్స్ మహారాష్ట్రకు 20 అంబులెన్సులు, 100 వెంటిలేటర్లు మరియు రూ .10 కోట్ల నగదు విరాళం అందిస్తోంది. వీటిని ఆ రాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే అందుకోనున్నారు అని మహారాష్ట్ర సర్కార్ ఒక ప్రకటన లో పేర్కొంది. కాగా మహారాష్ట్రలో కరోనా కేసులు 2 లక్షల దిశగా వెళ్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news