రేపు పెద్దల సభకు ట్రిపుల్ తలాఖ్…

-

గత కొద్ది నెలలుగా తీవ్ర ట్రిపుల్ తలాఖ్ బిల్లు అంశంపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో రేపటితో ఓ ముగింపు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను  బిల్లుపై పాలక భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖాముఖీ పోరుకు సంసిద్ధమయ్యాయి.  లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ తాజా బిల్లును ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం సోమవారం పెద్దల సభలోనూ బిల్లును ప్రవేశపెడుతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్‌ జరుగుతుందనే అంచనాతో భాజపా, కాంగ్రెస్‌లు తమ సభ్యులను సోమవారం పార్లమెంట్‌ సమావేశాలకు విధిగా హాజరు కావాలని విప్ జారీ చేశాయి.

అయితే ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్ బిల్లుని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారం విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది  ఇక సోమవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, సభామోదం పొందాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ పేర్కొంటుంది. ఎలాంటి మార్పులు చేయకుండా బిల్లుని యథావిథంగా ఆమోదించాలంటే..మేం ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ వర్గాలు పట్టుబట్టాయి. దీంతో సోమవారం రాజ్యసభలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news