రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 34 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రధానం చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముగ్గురిని పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది. బుర్ర వీణ వాయిద కళాకారుడైన నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసర కొండప్పకు కేంద్రం పద్మశ్రీకి ఎంపిక అయ్యాడు.
అలాగే, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు ,ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీకి ఎంపికచేసింది.అలాగే కళలు విభాగంలో బిహార్కు చెందిన భార్యా భర్తలు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్కు, త్రిపురకు చెందిన చక్మా రేఖాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించిగా 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్. 91 పద్మశ్రీ అవార్డులున్నాయి.