వాజ్ పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ముందే ఊహించారు..కేసీఆర్

-

తెలంగాణ శాసనమండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  హోదాలో కేసీఆర్ శాసన మండలికి విచ్చేశారు.  ఈ సందర్భంగా శాసనమండలిలో మాజీ ప్రధాని  వాజ్ పేయి మృతికి సంతాపం ప్రకటించారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాజ్‌పేయి ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని నెహ్రూ ముందే ఊహించారని గుర్తు చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నా వాజ్‌పేయి హూందాగా ఉంటూ..తన గౌరవం కాపాడుకున్నారని తెలిపారు.

శాసన మండలిని నిరవధిక వాయిదా

మాజీ ప్రధాని వాజ్ పేయితో పాటు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్, కొండగట్టు ఆర్టీసీ బస్సుప్రమాదం మృతులు, కేరళ వరద లకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. అనంతరం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ శాసన మండలిని నిరవధిక వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news