వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు-పేర్ని నాని

-

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటినుంచి ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ లు ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభిస్తున్నాయి.ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకియాలు వెడేక్కాయి. అధికార పార్టీ వారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరో పక్క ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి.

 

ఈ క్రమంలో అనంతరపురంలో గడప గడపకు కార్యక్రమంలో పేర్ని నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిబిఎన్ పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను చంద్రబాబు మోసం చేశాడని ఆరోపించాడు.వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మైనారిటీ, ఎస్టీ లకు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించలేదు.

మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారు.17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మంత్రి వర్గం లో చోటు కల్పించారు. ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్సార్ దే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేశాడు. ఏపీ బాగుండాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news