సెంచరీతో కదం తొక్కిన హిట్ మ్యాన్… భారీ స్కోర్ చేసిన టీమిండియా

-

భారత్‌-అఫ్గానిస్తాన్‌ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ ఆఫ్ఘన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌ ధాటికి కుప్పకూలింది. ఆరంభంలోనే విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్‌లను గోల్డెన్ డక్‌ ఔట్ చేసి భారత్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. 4 పరుగులకే జైస్వాల్‌ భారీ షాట్‌ ఆడబోయి నబీ చేతికి చిక్కాడు. శివం దూబే 1 పరుగు కే వెనుదిరగాడు .ఐదు ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రింకూ సింగ్‌ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 90 బంతుల్లో 195 పరుగులు చేశారు. ఈ బ్యాట్స్ మెన్లు సిక్సర్లు, బౌండరీలతో చెలరేగిపోయారు . కెప్టెన్ రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

ఇక.. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్ 3 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ కలిసి 36 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ ముందు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది . ఇక చివరి మూడు బంతుల్లో రింకూ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.

Read more RELATED
Recommended to you

Latest news