సైలెంట్‌గా కలెక్షన్స్ కొల్లగొడుతున్న షారుఖ్ ‘డంకీ’.. వారం రోజుల్లోనే రూ.305 కోట్లు

-

బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డుంకి. ఇప్పటికీ పఠాన్, జవాన్ సినిమాలతో వరుస హిట్లను సాధించిన షారుఖ్ ఖాన్ తాజాగా డుంకి సినిమాతో మరో హ్యాట్రిక్ అందుకున్నాడు. కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కి డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డుంకి చిత్రం పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. మొదటిరోజు  డుంకి సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. మొదట కలెక్షన్స్ దారుణంగా ఉన్నప్పటికీ…. తాజాగా అందిన సమాచారం మేరకు 8 రోజుల్లోనే 305 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే మరో వీకెండ్ లో మరో 100 కోట్ల మేరా వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో షారుక్ నెక్స్ట్ నటించబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకి పోటీగా విడుదలైనటువంటి సలాం చిత్రం 500 కోట్లపై వసూలు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news