త్వరలోనే 1.60 వేల ఉద్యోగాల భర్తీ : హరీష్ రావు కీలక ప్రకటన

-

రానున్న రోజుల్లో 1.60 వేల ఉద్యోగుల భర్తీ చేస్తామని ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో 164 డబ్బులు బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మంత్రి హరీష్ రావుతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఎస్ సి , ఎస్టీ లకు రాజ్యాంగ పరంగా అన్ని అమలు అవడం లేదు అని ముఖ్యమంత్రి రాజ్యాంగ సవరించాలి అని అన్నారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ను కపడుకుంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం రైతుల ఎరువుల ధరలు పెంచింది రైతుల నడ్డి విరిచిందని ఫైర్ అయ్యారు. వ్యవసాయ బావుల కడ మీటర్ లు పెట్టుమన్న బీజేపీ కావాలా, ఉచిత కరెంట్ ను ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా ? అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై కేంద్రం ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం 7 లక్షల ఉద్యోగుల ఖాళీగా ఉన్నాయి అని బండి సంజయ్ ఒప్పుకున్నారని.. బట్టే బజ్, అబ్బాదల సోషల్ మీడియా పార్టీ బీజేపీ పార్టీ అని చురకలు అంటించారు మంత్రి హరీష్ రావు. సోషల్ మీడియాలో వచ్చే అబ్బాద్దాపు, జటా మాటలను నమ్మొద్దని కోరారు. కేంద్రం ప్రభుతం సబ్వీడే ల కోతల ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news