గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన.. ఇంకా 100 మంది ఆచూకీ గల్లంతు

-

గుజరాత్‌లో మోర్బీ ప్రాంతంలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం ఎన్నో వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే 130కి పైగా దాటింది. ఇంకా దాదాపు వందమంది గల్లంతై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. వారి మృతదేహాలు బురద నీటిలో చిక్కుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఈ రోజుకు సహాయక చర్యలు నిలిపివేశారు. రేపు ఉదయం తిరిగి మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Search and rescue work is going on as a cable suspension bridge collapsed in Morbi town of western state Gujarat, India, Monday, Oct. 31, 2022. The century-old cable suspension bridge collapsed into the river Sunday evening, sending hundreds plunging in the water, officials said. (AP Photo/Ajit Solanki)

మరోవైపు..ఘటనకు గల కారణాలను ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ప్రారంభించిన బ్రిడ్జ్‌పైకి భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపాయి.

గుజరాత్‌కు చెందిన ఒరెవా గ్రూప్‌ ఈ వంతెన మరమ్మతులు చేపట్టింది. సీఎఫ్‌ఎల్‌ బల్బులు, గోడ గడియారాలు, ఈ-బైక్‌లు తయారు చేసే కంపెనీగా పేరొందిన ఈ సంస్థకు నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేకపోవడం గమనార్హం. అలాంటి కంపెనీకి వందేళ్ల పురాతన బ్రిడ్జి మరమ్మతు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ ఎలా దక్కిందన్నదానిపై ఇప్పుడు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news