వాస్తు: కొవ్వొత్తిని ఈ దిశలో వెలిగిస్తే … పిలల్లు బాగా చదువుతారట..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు పిల్లల స్టడీ రూమ్ లో ఎలాంటి చిట్కాలను పాటించాలి అనేది చెప్పారు. మరి పిల్లల స్టడీ రూమ్ లో ఎలాంటి చిట్కాలను పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

పిల్లలు చదువుకునే గదిలో సరస్వతి దేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. దీని వలన పిల్లలకి చదువు బాగా వస్తుంది.

చదువుకునే గదిలో చక్కటి శ్రద్ధ పెట్టాలి. పిల్లలు చదువుకునే గదిలో అద్దం ఉండకూడదు. స్టడీ టేబుల్ ఎదురుగా అద్దం ఉంటే అసలు మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునేటప్పుడు వారి యొక్క తల దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఉండాలి ఇలా చేయడం వల్ల మంచిగా పిల్లలు ఏకాగ్రత పెట్టగలరు.

అలానే కొవ్వొత్తిని తూర్పు వైపు కానీ దక్షిణ వైపు కానీ వెలిగించి ఉంచితే మంచిది. దీని వలన తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి ఇలా మీరు చెయ్యండి.

వాస్తు శాస్త్రం ప్రకారం వాళ్ళ రూమ్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అడ్డదిడ్డంగా బట్టలు వంటివి పడిపోయి ఉండకూడదు చెప్పులు వంటివి కూడా ఉండకూడదు. మూసేసి ఉండే గడియారాన్ని పెట్టుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news