శ్రీ చైతన్య కాలేజీలో 100 మంది స్టూడెంట్స్‌కు తీవ్ర అస్వస్థత..

-

హైదరాబాద్‌ మహానగర పరిధిలోని మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో బాలికల క్యాంపస్‌లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సుమారు 100 మంది అస్వస్థతకు గురికావడంతో వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.వైద్య పరీక్షల అనంతరం వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తేలింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా వారికి ట్రీట్మెంట్ చేయిస్తున్నారని విద్యార్థి సంఘం నేత నవీన్ యాదవ్ ఆరోపించారు.

కనీసం విద్యార్థినుల పేరెంట్స్‌కు కూడా విషయం చెప్పలేదని, కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. బాధిత విద్యార్థినిలకు మెరుగైన చికిత్స అందించాలని, లేనియెడల కాలేజీని ముట్టడిస్తామని నవీన్ యాదవ్ హెచ్చరించారు.చైతన్య కాలేజీలో ఇలాంటి ఘటనలు షరామామూలు అయ్యాయని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు జరపాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం మాత్రం ఎవరికి ఫుడ్ పాయిజన్ కాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version