గుజరాత్ మోర్భిలో 108 అడుగుల భారీ విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

-

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్న వేళ గుజరాత్ లో ఉత్సవాల హోరును మరింత పెంచుతూ భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.గుజరాత్ లొని మోర్బి లో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “హనుమాన్ జి చార్ ధామ్” ప్రాజెక్టులో భాగంగా దేశనలుదిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.పశ్చిమ రాష్ట్రం గుజరాత్ లో మోర్బి లోని బాపు కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండవది.

ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటుు చేశారు.దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.హనుమాన్ జి చార్ దామ్ ప్రాజెక్టులో భాగంగా షిమ్లా లోని జఖూబాలో నిర్మించిన హనుమాన్ విగ్రహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోను చోటు సంపాదించుకుంది.ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు పొందింది.మరికొద్ది రోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ భారీ హనుమాన్ విగ్రహాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించిన ప్రధాని మోదీ త్వరలోనే సొంత రాష్ట్ర పర్యటనకు కూడా వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news