108 అంటే మనకు వెంటనే అంబులెన్స్ గుర్తుకువస్తుంది. లేదంటే ప్రదక్షిణలు గుర్తుకొస్తాయి. కానీ 108 నెంబర్‌కు ఎంత పవర్ ఉందో తెలుసా..? పురాణాల దగ్గర నుంచి గణిత సమీకరణాల వరకూ ఈ నెంబర్‌కు ప్రాముఖ్యత ఉంది. మనకు తెలియకుండా ఈ విశ్వంలో ఈ నెంబర్ ఎన్ని విధాలుగా పనిచేస్తుందో చూద్దామా..!
అనేక పవిత్ర విషయాలు ఈ 108 సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా హిందువులంతా పవిత్రంగా కొలుచుకునే నది గంగా నది. ఈ నది కొలతలు కూడా 108. గంగా నది అక్షాంశం 9 అయితే రేఖాంశం 12. ఈ రెండు సంఖ్యలను గుణించినపుడు వచ్చేది 108. మన దేశంలో 108 పవిత్ర స్థలాలు ఉన్నాయి. వీటినే అష్టాదశ పీఠాలు అంటారు. ఉపనిషత్తులు 108, వాటిలో మర్మాలు 108. సంస్కృతంలోనూ 54 అక్షరాలు ఉంటాయి. వీటికి స్త్రీ పురుష రూపాలుంటాయి. వీటి మొత్తం కూడా 108 ఏ అవుతుందట.
యోగాలో 108 సంఖ్య ఆధ్యాత్మిక సంపూర్ణతకు సంకేతం. అందుకే జపమాలలు 108 పూసలతో ఉంటాయి. మేరు పూసను చేరిన తర్వాత తిరిగి వెనుకకు జపమాలను తిప్పుతూ జపం చేస్తారు. సాధారణంగా ప్రాణాయామాలు కూడా 108 సైకిల్స్ చెయ్యాల్సిందిగా చెప్తారు. సూర్య నమస్కారాలు కూడా మొత్తం పన్నేండు యోగాసనాలు తొమ్మిది సైకిళ్లుగా చెయ్యాల్సి ఉంటుంది. 12 ను 9తో గణించినపుడు 108 వస్తుంది. ఈ పవిత్ర సంఖ్యతో మనలోని రిథమ్‌ను అనుసంధానం చెయ్యడాన్ని సృష్టితో అనుసంధానం చేసినట్లుగా పండితులు భావిస్తారు.
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు అత్యంత ముఖ్యమైనవిగా చెప్తారు.. మొత్తం నక్షత్రాలు 27, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం నక్షత్ర పాదాలన్నీ కూడా 108ఏ ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈ 108 పాదాల్లో ఒక దానికి చెంది ఉంటారు… అలాగే రాశి చక్రంలో రాశులు 12, గ్రహాల 9 ఈ రెండింటి గుణకారం కూడా 108. సూర్యుడికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని మన ప్రాచీన ఖగోళ శాస్త్రం చెప్తోంది. సూర్యుని వ్యాసం భూమి వ్యాసంతో పోలిస్తే 108 రెట్లు ఎక్కువ. ఇంకా చంద్రుని వ్యాసం భూమి కంటే 108 రెట్లు తక్కువగా ఉంటుంది..
108 ముడులు వేసిన ఉన్ని దారాన్ని పవిత్రమైందిగా సిక్కులు భావిస్తారు.
చైనీస్ జ్యోతిషశాస్త్రంలో 108 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 72 హానికరమైనవి అయితే, మిగిలిన 36 ప్రయోజనకరమైనవి.
టిబెటన్ ఇతిహాసాల్లో 108 మంది మాస్టర్స్, దీక్షాపరులు కూడా 108.
జైన మతంలో కర్మ ప్రవాహ సంఖ్యను 108 గా చెబుతారు.
బౌద్ధంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గంటను 108 సార్లు మోగిస్తారు. బౌద్ధ ధర్మంలో మనిషిగా పుట్టిన వాడు 108 ప్రలోభాలను దాటుకుని పుణ్యలోకాలను చేరాల్సి ఉంటుందని చెప్తారు.
క్రైస్తవుల సెలవు దినాలు నవంబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకు 54 పగళ్లు, 54 రాత్రులు. ఈ రెండు తేదీల మధ్య కాలంలో చీకటి వెలుగుగా 108 సార్లు పరివర్తన చెందిందని భావిస్తారు.