వైసీపీలో సంచలనం..సిట్టింగులకే సీటు..కానీ..!

-

ఎప్పటికప్పుడు వర్క్ షాపులు నిర్వహిస్తూ ఎమ్మెల్యేల పనితీరు మెరుగయ్యేలా చేస్తున్న సీఎం జగన్ మరోసారి..వర్క్ షాప్ పెట్టారు. తాజాగా తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించిన జగన్…మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇప్పటికే పలుమార్లు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. అప్పుడు పనితీరు మెరుగ్గా లేని ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు.

ఈ సారికి ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు మరోసారి వర్క్ షాప్ పెట్టిన జగన్ ఏకంగా 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, మార్చి లోగా వారి పనితీరు మెరుగు పర్చుకోవాలని లేదంటే..సీట్లు ఇవ్వడం కష్టమే అని తేల్చి చెప్పారు. మార్చి తర్వాత ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే మార్చి తర్వాత సీట్లు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎక్కువ శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తానని, కానీ సరిగ్గా పనిచేయని వారికి మళ్ళీ సీటు ఇవ్వనని మాత్రం తేల్చి చెప్పేశారు. అంటే నెక్స్ట్ మార్చి తర్వాత ఎవరికి సీటు రాదో జగన్ తేల్చి చెప్పనున్నారు. ప్రస్తుతం వర్క్ షాపులో జంపింగ్ ఎమ్మెల్యేలని కూడా పిలిచారు. టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు. వారిని కూడా వర్క్ షాపుకు పిలిచారు.

వారు కూడా గడపగడపకు వెళుతున్నారు..వారి పనితీరుపై కూడా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. అందులో వల్లభనేని వంశీ, రాపాక వరప్రసాద్‌లకు మళ్ళీ సీటు ఫిక్స్ అని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే 32 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని తెలుస్తోంది. కానీ 175కి 175 సీట్లు గెలిచేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. దీని బట్టి చూస్తే ఆ టార్గెట్ పక్కన పెడితే..మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి కష్టపడితే బెటర్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news