ఏపీలో మహిళా సర్పంచ్​పై 11 మంది అత్యాచారయత్నం

-

ఏపీలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళా సర్పంచ్​పై 11 మందికి అత్యాచారానికి యత్నించారు. స్థానికుల సాయంతో వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజయనగరంలో ఓ మహిళా సర్పంచిపై 11 మంది లైంగిక దాడికి యత్నించారు. తప్పించుకున్న బాధితురాలు దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను రేకులషెడ్డులో ఉండగా.. బుధవారం మధ్యాహ్నం పి.రమణబాబు, పి.సుధాకర్‌, పి.మధు, పి.జగదీష్‌, పి.భద్రరావు, ఎల్‌.సురేష్‌కుమార్‌, ఎ.శ్రీనివాసరావు, ఎల్‌.వెంకటరాజు, పి.ప్రసాద్‌, ఇ.సోమశేఖర్‌, పి.శ్రీనివాసరావు వచ్చి లైంగికదాడికి యత్నించారని పేర్కొన్నారు.ప్రతిఘటించే యత్నం చేయడంతో చంపాలని చూశారని పోలీసులకు తెలిపారు. మెడభాగం, పొత్తి కడుపు, ఇతర అవయవాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారని వెల్లడించారు. కేకలు వేయగా.. చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయారని చెప్పారు.

మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులను ఆరా తీసినట్లు ఎస్సై శ్యామలాదేవి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news