పోలీసులకే తుపాకీ గురిపెట్టిన షారూఖ్ అరెస్ట్

-

ఇటీవల ఈశాన్య ఢిల్లీ లో చోటుచేసుకున్న హింస ఘటనలు అంతా ఇంతా కాదు. ఈ హింసాత్మక ఘటనల వల్ల ఇప్పటికే 46 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు కూడా. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో ఏకంగా పోలీసులకే ఎక్కుపెట్టిన షారూఖ్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మౌజ్‌పూర్‌లో చోటు చేసుకున్న అల్లర్ల సమయంలో షారూక్ ఖాన్ ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుగానే ధైర్యంగా తుపాకీ ఎక్కుపెట్టి ఈ చర్యకు పాల్పడ్డాడు. దీంతో అతని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అప్పటినుంచి కూడా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న షారూఖ్(33) సీఏఏ ఆందోళనల్లో భాగంగా ఢిల్లీ పోలీసుకు తుపాకీ గురిపెట్టిన విషయం తెలిసిందే. అయితే అతడినిక్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో అతణ్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసుకు పిస్టల్ గురి పెట్టిన ఆ వ్యక్తిని మహ్మద్ షారుఖ్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 24న షారుఖ్ జఫ్రాబాద్ వీధుల్లో నడుస్తూ.. తుపాకీతో భయపెట్టాడు. పోలీసు ముందే గాల్లోకి కాల్పులు జరిపి పరారయ్యాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అతడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, అతడి తండ్రిపై నార్కోటిక్స్, దొంగ నోట్ల కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతడు ఉపయోగించిన పిస్టల్‌ను రికవర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. షారుక్‌పై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసుతోపాటు 186, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version