భూమి లేని రైతు కూలీలకు ప్రతీ ఏటా 12 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని తెలిపారు. తాజాగా జరిగిన కేబినేట్ మీటింగ్ తర్వాత ఈ ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
సింగూర్ ప్రాజెక్టుకు మాజీ మంత్రి, దివంగత నేత సిలారపు రాజనర్సింహ పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినేట్. ఈ మేరకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు జనవరి 26, 2025 నుంచి అమలవుతాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.