మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పలు రాష్ట్రాల్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
మొత్తం 1,226 పోస్టులున్నాయి. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1100 ఉండగా, బ్యాక్లాగ్ పోస్టులు 126 ఉన్నాయి. గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతోంది. ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్టులకు అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 29 చివరి తేదీ. వయస్సు వచ్చేసి 2021 డిసెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులకు 2022 జనవరిలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది.ఆన్లైన్ ఫీజు పేమెంట్ 2021 డిసెంబర్ 9 నుంచి 2021 డిసెంబర్ 29 లోగ చెల్లించాలి. ఇక విద్యార్హతలు వివరాలలోకి వెళితే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.
అలానే ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. అలానే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సబ్సిడరీస్లో పనిచేస్తున్నవారు, ఎస్బీఐలో క్లరికల్, సూపర్వైజర్ కేడర్‌లో పనిచేసినవారు, ఎస్బీఐలో ఆఫీసర్ గ్రేడ్ నుంచి రిజైన్ చేసినవారు దరఖాస్తు చేయకూడదు. నోటిఫికేషన్: https://sbi.co.in/documents/77530/11154687/081221-CBO-21+Final+Detailed+Advt+ENG.pdf/6d3a8188-f5a6-e9dd-98fc-e580796a0766?t=1638963781497
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్సైట్లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.