ఆ నాలుగు జిల్లాల్లో కమలం జీరో.. సెట్ చేయకపోతే కష్టమే..

-

తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా టీఆర్ఎస్‌ని గద్దె దించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశగానే బీజేపీ నేతలు ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు సైతం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు గైడెన్స్ ఇస్తూ… పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా అమిత్ షా సైతం బీజేపీ నేతలకు గైడెన్స్ ఇచ్చారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అలాగే బలం లేని చోట్ల టీఆర్ఎస్ నేతలని పార్టీలోకి తీసుకోవాలని చెప్పారు. అమిత్ షా సూచనలని పాటిస్తూ బీజేపీ నేతలు ముందుకెళుతున్నారు. బలం లేని నియోజకవర్గాల్లో బలం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. బీజేపీ పలు జిల్లాల్లో ఇంకా బలపడాల్సి ఉంది.

బీజేపీకి రాష్ట్ర స్థాయిలో బలం లేదనే సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో బీజేపీకి సరైన నాయకులు కూడా లేరు. అసలు ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో బీజేపీకి బలమైన నాయకులు పెద్దగా కనిపించరు. అలాంటి జిల్లాల్లో బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది.

తెలంగాణలో అధికారంలోకి రావడానికి 60 సీట్లు కావాలి… ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల్లో 60 సీట్లు వన్ సైడ్‌గా రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లని ఢీకొని 60 సీట్లు తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఏదో రెండు, మూడు జిల్లాల్లో బలంగా ఉంటే సరిపోదు… మిగిలిన జిల్లాల్లో కూడా సత్తా చాటాలి. ముఖ్యంగా ఆ నాలుగు జిల్లాల్లో బీజేపీ నాలుగేసి సీట్లు తెచ్చుకున్న గొప్ప విషయమే. అదే గానీ జరిగితే బీజేపీకి తిరుగుండదు. లేదంటే బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదు.

Read more RELATED
Recommended to you

Latest news