కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 135 ఉద్యోగాలు.. టెన్త్ ప్యాస్ అయితే చాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన నాగ్‌పుర్‌ లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఈ పోస్టులు వున్నాయి.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు. పదో తరగతితోపాటు, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా సంబంధిత కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక వయస్సు విషయానికి వస్తే… జనవరి 19, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రూ.1150లు అప్లికేషన్‌ ఫీజు కట్టాల్సి వుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వుంది. ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాల్సి వుంది.

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టు వివరాలని చూస్తే.. మైనింగ్ సర్దార్ (టెక్నికల్ అండ్ సూపర్‌వైజరీ గ్రేడ్-సి) పోస్టులు 107 వున్నాయి. సర్వేయర్- మైనింగ్(టెక్నికల్ అండ్ సూపర్‌వైజరీ గ్రేడ్-బి) పోస్టులు 28 వున్నాయి. పూర్తి వివరాలని http://www.westerncoal.in/index1.php లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news