జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఏయే రోజులు అంటే..?

-

బ్యాంకులకి కొన్ని రోజులు సెలవులు ఉంటాయి. బ్యాంకులకి ఏ ఏ రోజులు సెలవులు అనేది తెలుసుకొని ముందుగా బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాంకు పనులు సరైన టైమ్ కి పూర్తి కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకని బ్యాంకు సెలవులు ఎప్పుడో ముందుగా గమనించి దానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఆదివారాలు రెండో శనివారాలు నాలుగో శనివారాలు బ్యాంకులకి సెలవులు అన్న విషయం మనకి తెలిసిందే.

దాంతో పాటుగా పండగ సెలవులు కూడా వస్తూ ఉంటాయి. ఇక జూన్ నెల ముగిసి పోనుంది జూలై నెల మొదలు కాబోతోంది, జూలైలో ఏ ఏ రోజులు బ్యాంకులు పనిచేయవు.. ఏ ఏ రోజులు సెలవులు అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం.. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక సెలవులు ఉంటాయి జూలైలో కూడా కొన్ని ప్రత్యేక సెలవులు కొన్ని రాష్ట్రాలలో ఉండనున్నాయి. మరి ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రోజులు సెలవు అనే విషయాన్ని కూడా చూసేయండి..

జులై 2 – ఆదివారం
జులై 5 – గురు హర్‌గోవింద్ సింగ్ జయంతి కారణంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 6 – MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంకులు క్లోజ్
జులై 8 – రెండో శనివారం
జులై 9 – ఆదివారం
జులై 11- కెర్ పూజ కారణంగా త్రిపుర లో క్లోజ్
జులై 13- భాను జయంతి కారణంగా సిక్కిం లో బ్యాంకులు క్లోజ్
జులై 16- ఆదివారం
జులై 17- U తిరోట్ సింగ్ డే కారణంగా మేఘాలయ లో బ్యాంకులు పని చేయవు
జులై 22- నాలుగో శనివారం
జులై 23- ఆదివారం
జులై 29- మొహర్రం
జులై 30- ఆదివారం
జులై 31- Martyrdom Day కారణంగా హరియాణా, పంజాబ్ లో సెలవు

 

Read more RELATED
Recommended to you

Latest news