గత కొన్ని రోజుల నుంచి.. ఇండియా లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మొన్న దీపావళి రోజున.. పెట్రోల్ పై ఐదు రూపాయలు… డీజిల్ పై పది రూపాయల ఎక్సైజ్ డ్యూటీని… తగ్గిస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో.. వాహనదారులకు కాస్త ఊరట లభించింది. ఇక మోడీ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం… తర్వాత మరికొన్ని రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాయి.
ఇప్పటి వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 22కు చేరగా… మరో 14 రాష్ట్రాలు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పద్నాలుగు రాష్ట్రాలలో లిస్టులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండటం గమనార్హం. ఇక ఇప్పటివరకు పెట్రోల్ మరియు డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఓసారి పరిశీలిస్తే… మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, అండమాన్ & నికోబార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ మరియు రాజస్థాన్ ఉన్నాయి.