దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గించిని రాష్ట్రాలు… తగ్గించని రాష్ట్రాలేవో తెలుసా..?

-

దీపావళి కానుకగా కేంద్రం పెట్రోల్ , డిజిల్ ధరలను రూ. 5, రూ. 10 చొప్పున తగ్గించాయి. గత కొంత కాలంగా పెట్రోల్ , డిజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో కొంతలోకొంత సామాన్యుడిపై భారం తగ్గింది. అయితే కేంద్రం నిర్ణయంతో పాటు పలు రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించడం ద్వారా మరింతగా పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి పెట్రోల్ ధరలను సామాన్యుడికి మరింత అందుబాటులోకి తెచ్చాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు పెట్రోల్, డిజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించలేదు. అయితే పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గింపు పై అధ్యయనం చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.

పెట్రోల్ రేట్లు తగ్గించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు:

కర్ణాటక, పుదుచ్చేరి, గోవా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, బీహార్, మధ్య ప్రదేశ్, గుజరాత్, దాద్రానగర్ హావేలి, డామన్ డయ్యూ, చంఢీగడ్, హరియానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, లద్దాఖ్, ఒడిశా.

పెట్రోల్ రేట్లు తగ్గించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మేఘాలయ, అండమాన్ నికోబార్, జార్ఖండ్, చత్తీస్గడ్, పంజాబ్, రాజస్థాన్

Read more RELATED
Recommended to you

Latest news