బాయ్ ఫ్రెండ్ తో బయటకెళ్ళిన మైనర్.. భయపెట్టి గ్యాంగ్ రేప్ !

-

ఛత్తీస్గఢ్ లోని కబీర్‌ధామ్ జిల్లాలో 14 ఏళ్ల గిరిజన బాలికను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. ఆదివారం రాత్రి జిల్లా ప్రధాన కేంద్రం అయిన కవర్ధ పట్టణంలోని సిటీ కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని కబీర్ ధామ్ పోలీసు సూపరింటెండెంట్ శలాబ్ సిన్హా తెలిపారు. కొంత మంది అనుమానితులను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నామని, అయితే ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిపారు.

బాలిక ఫిర్యాదు ప్రకారం, బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్తోన్న ఆమెను నలుగురు నిందితులు వీరిద్దరిని అడ్డగించారు. బెదిరించిన తన బాయ్ ఫ్రెండ్ ని అక్కడినుండి పంపేశారు. వారు అనంతరం మైనర్ బాలికను ఏకాంత ప్రదేశానికి లాగి, సంఘటన స్థలం నుంచి తప్పించుకునే ముందు ఆమెపై అత్యాచారం చేయడానికి తీవ్రంగా యత్నించారని పోలీసు అధికారి తెలిపారు. అయితే సహాయం కోసం బాలిక అరుపులు విన్న కొంతమంది స్థానికులు పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని సంప్రదించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం బాలిక గుర్తు తెలియని నలుగురు నిందితులపై సిటీ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news