బద్వేలు ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు..

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల బరి లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. నామినేషన్ల ఉప సంహరణ తరువాత పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారని స్పష్టం చేశారు ఎన్నికల సంఘం. ఇక ఇవాళ ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లను ఉప సంహరించు కోగా.. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ దాఖలు చేశారు.

badvel

అయితే.. నామినేషన్ల పరిశీలనలో 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఉప సంహరణ అనంతరం చివరిగా 15 మంది అభ్యర్థులు మాత్రమే బద్వేలు ఉప ఎన్నికల బరి లో ఉన్నారు. అటు హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలోనూ 30 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్లు ప్రారంభమైన తర్వాత మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేస్తే ప్రస్తుతం నామినేషన్ల తిరస్కరణ, విత్ డ్రాల అనంతరం 30 మంది చివరగా పోటీలో ఉన్నారు.కాగా.. ఈ రెండు ఉప ఎన్నిలు ఈ నెల 30 వ తేదీన జరుగనున్నాయి.