ఇక నుంచి ప్రతీ రోజు 15 లక్షల పరీక్షలు…!

-

భారత్ రోజూ 15 లక్షల కోవిడ్ -19 పరీక్షలను నిర్వహిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం “మెరుగైన మౌలిక సదుపాయాలు, దూకుడు మరియు సులభంగా దేశవ్యాప్తంగా పరీక్షల కారణంగా అమలు చేస్తున్న వ్యూహాల కారణంగా దేశంలోని రోజువారీ పరీక్షా సామర్థ్య౦ పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. “ప్రతిరోజూ 15 లక్షలకు పైగా కోవిడ్ -19 పరీక్షలు చేయవచ్చు” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

corona test
corona test

దేశంలో ఎక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు ఎక్కువ పరీక్షల కారణంగా పెరుగుతున్నాయని కేంద్రం పేర్కొంది. భారతదేశంలో, అన్ని వర్గాల ప్రజలు ఇంతకుముందు జారీ చేసిన ప్రాథమిక కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అసహనం వ్యక్తం చేసింది. ఇళ్ళ నుండి బయట పడుతున్న చాలా మంది ప్రజలు మాస్క్ లు ధరించడం లేదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news