పొడవు పెరగడానికి సర్జరీల వైపే మొగ్గు..!

-

పొడుగు పెరగడానికి ఏటా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కాళ్లకు సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ చికిత్స చాలా ప్రమాదకరమైనదని తెలిసినా వందలాది మంది సర్జరీవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, దీనివల్ల రిస్క్ ఉందని, దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలొస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

పొడుగ్గా కనిపించడానికి సర్జరీ చేయించుకున్న శామ్ బెకర్ తన అనుభవాలను ఇలా వివరిస్తున్నారు.

చిన్నప్పుడు పొడుగ్గా ఉండేవాడిని, కానీ కాలేజీకెళ్లేసరికి అందరిలోనూ నేనే పొట్టిగా కనిపించేవాడిని. పొడవులో ఏముంది అనుకుంటాం కానీ అది జీవితాలపై ప్రభావం చూపిస్తుందని శామ్​ తెలిపాడు. పొట్టిగా ఉండే వాళ్లతో అమ్మాయిలు స్నేహానికి గానీ, డేటింగ్ చెయ్యడానికి కానీ ఇష్టపడరు. ఒక్కోసారి నాకసలు పెళ్లవ్వదేమో, భార్య దొరకదేమో అని బెంగపడేవాడిని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనకు 30 ఏళ్లు వచ్చేసరికి తను ఇక పొడుగవ్వడని తెలిసి.. పొడుగవ్వడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. ఏవీ పని చెయ్యలేదు. అప్పుడు ఆయనకు సర్జరీ గురించి తెలిసింది. తన తల్లిని ఒప్పించి, 2015లో కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు.

ఐదు అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉండే అతను.. ఐదు అడుగుల 7 అంగుళాలకు పెరిగేట్లు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ ఎంత క్లిష్టమైనదో డాక్టర్లు ముందే చెప్పారు. దానితో అతనికి మూడు అంగుళాలు పెరిగిన తరువాత తాను సరిగ్గా నడవగలుగలనా, పరిగెత్తగలనా అనే సందేహాలు తలెత్తాయి.

ఆపరేషన్ తరువాత ఆరు నెలల పాటు వారానికి మూడు, నాలుగు రోజులు ఫిజియో థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇదో కొత్త అనుభవం. కాళ్లు విరగ్గొట్టి అతికించుకుని, మళ్లీ నడక నేర్చుకోవడం.. వింతైన అనుభవం. మానసికంగా స్వస్థత పొందడానికి నేను చాలా ప్రయత్నించాను” అని శామ్ వివరించారు.

డజనుకు పైగా దేశాల్లో కాళ్ల పొడవును 5 అంగుళాల దాకా పెంచగలిగే సర్జరీ అందుబాటులో ఉంది. ఈ సర్జరీ క్రమేపీ పాపులర్ అవుతోందని క్లినిక్స్ అంటున్నాయి.యూకేలో ఈ సర్జరీ చేయించుకోవడానికి సుమారు రూ. 50 లక్షల వరకూ ఖర్చవుతుంది. అమెరికాలో రూ. 55 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ ఖర్చవుతుంది.

నాటి సోవియట్‌ రష్యాకు చెందిన వైద్యులు గావ్రిల్ ఇలిజరోవ్ ఈ చికిత్సను కనుగొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేసేటపుడు ఈ సర్జరీకి పునాది పడింది. గత 70 ఏళ్లల్లో ఈ చికిత్సా విధానం అభివృద్ధి చెందినప్పటికీ మూల సూత్రాలు ఏమీ మారలేదు.

కాళ్లల్లోని ఎముకలకు రంధ్రం చేసి, వాటిని రెండుగా విడదీస్తారు. తరువాత వాటి మధ్య లోహంతో చేసిన ఒక రాడ్‌ను అమర్చి, కావలసిన పరిమాణానికి చేరుకునేవరకూ ప్రతి రోజూ దాన్ని ఒక్కో మిల్లీ మీటర్ చొప్పున పెంచుతూ ఉంటారు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. అనంతరం, చికిత్స చేయించుకున్న వ్యక్తి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల పాటు థెరపీ చేయించుకోవల్సి ఉంటుంది. ఈ చికిత్సలో అనేక రకాల రిస్కులు ఉన్నాయి. నరాలు దెబ్బ తినడం, రక్తం గడ్డకట్టడం, కాళ్లల్లో ఎముకలు అతుక్కోకపోవడం లాంటి అనేక సమస్యలు రావొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news