
కరోనా ఎక్కడికి, ఎప్పుడు, ఎలా… వెళుతుందో చెప్పడం ఎవ్వరితరం అవ్వడంలేదు వైరస్ సంక్రమణ ఆపడం ఎవ్వరికీ వీలు పట్టడం లేదు. అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఆ ప్రయత్నాలన్నీ విఫలముతున్నాయి. దేశ రాజధాని ఢిల్లోలో కరోనా విలయతాండవం చేస్తుంది నగరంలోని మండోలి జైలులోని నేరస్తులకు కరోనా టెస్టులు చేయగా వారిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఆదివారం జైల్లోని 62 ఏళ్ల వృద్ధుడు మరణించడంతో టెస్టులు చేయడం ప్రారంభించారు అధికారులు. అసలు జైల్లోకి కరోనా ఎలా వచ్చిందో అక్కడి అధికారులకి అర్థం అవ్వక ముక్కున వేలు వేసుకున్నారు. ఇకపోతే దేశంలో కరోనా సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.. ఇప్పటికే 4,25,282 కేసులు నమోదు అవ్వగా నిన్న మరో 14,821 కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య 13,699 కి చేరడంతో ప్రజలు అంధోలన పడుతున్నారు.