1947 నుంచి 2022 వరకు క్రీడా రంగంలో భారతదేశం సాధించిన విజయాలు..

-

మన భారత దేశ చరిత్ర గురించి చెప్పాలంటే మాటలు చాలవు..1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే..1947 నుంచి దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇదో గొప్ప అవకాశం. స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను భావితరాలకు మనం వివరించాల్సిన అవసరం ఉంది..అప్పటి నుంచి ఇప్పటివరకు సాదించిన విజయాల గురించి ఇప్పుడు వివరంగా చుద్దాము..

నాటి గాంధీ, నెహ్రూ నుంచి.. నేటి మోదీ​ వరకు.. ఈ పుడమి ఎందరో గొప్ప నేతలను అందించింది. అటు క్రీడల్లోనూ ఎందరో మట్టిలో మాణిక్యాలు ఉద్భవించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఇప్పటివరకు భారత్​ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పి, దేశానికే గర్వకారణంగా నిలిచిన పలువురు క్రీడాకారులు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వారి మరపురాని విజయాలను ఓసారి గుర్తుచేసుకుందాం..

క్రికెట్​:

భారత్​లో క్రికెట్​ అంటే ఓ ఆట కాదు.. ఓ మతం. ఈ క్రీడపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘క్రికెట్​ ఈజ్​ మై రిలీజియన్​.. సచిన్​ ఈజ్​ మై గాడ్​’ అన్న నినాదాలు దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి..మన దేశంలో ఆదరణ మొదలైంది మాత్రం 1983 ప్రపంచకప్​ తర్వాతే అని చెప్పుకోవాలి. కపిల్​ దేవ్​ సారథ్యంలో టీమ్​ఇండియా ప్రపంచకప్​ను ముద్దాడి.. ప్రపంచానికి భారత్​ సత్తాను చాటిచెప్పింది…ఆ తర్వాత ధోని సేన 2007లో టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టీ20ల్లో తొలి ప్రపంచకప్​ అదే..

హాకీ:
స్వతంత్ర భారతంలోను విజయాల పరంపరను కొనసాగించింది హాకీ టీమ్​. 1948 లండన్​ ఒలింపిక్స్​ ఫైనల్​లో గ్రేట్​ బ్రిటన్​పై 4-0 తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
1952 హెల్సింకీ ఒలింపిక్స్​లో ప్రతికూల వాతవరణాన్ని తట్టుకుని మరీ అఖండ విజయాన్ని నమోదు చేసింది భారత బృందం..

1956 మెల్​బోర్న్​లోనూ జట్టు పసిడి గెలిచింది. అయితే ఆ టోర్నీలో 5 మ్యాచ్​లు ఆడిన టీమ్​ఇండియా.. ఏ పోరులోనూ ప్రత్యర్థిని ఖాతా కూడా తెరవనివ్వలేదు. సింగపూర్​(6-0), అఫ్గానిస్థాన్​(14-0), అమెరికా(16-0), జర్మనీ(1-0), పాకిస్థాన్​(1-0)తేడాతో గెలిచి కప్​ను దక్కించుకుంది.
1960 ఒలింపిక్స్​లో భారత్​ రికార్డుకు బ్రేక్​ పడింది. అప్పటివరకు వరుసగా 6 పసిడి పతకాలు సాధించిన టీమ్​ఇండియా.. ఆ ఒలింపిక్స్​లో వెనకడుగు వేసింది. పాకిస్థాన్​కు పసిడి దక్కింది. అయితే 1964 టోక్యో ఒలింపిక్స్​లో తిరిగి స్వర్ణాన్ని అందుకుంది పురుషుల హాకీ జట్టు. పాకిస్థాన్​తో జరిగిన ఫైనల్​లో 1-0 తేడాతో విజయం సాధించింది.

1980 మాస్కో ఒలింపిక్స్​లో స్వర్ణం భారత్​కు ఎంతో ప్రత్యేకం. 1964 తర్వాత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న భారత జట్టు వాటన్నింటినీ అదిగమించి 1980లో సత్తా చాటింది.ఆ తర్వాత హాకీలో భారత్​ స్థానం పడిపోయింది. అప్పటివరకు అధిపత్యాన్ని కొనసాగించి ఒక్కసారిగా వెనకపడిపోయింది. అయితే ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో హాకీ జట్టు చెలరేగిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత పురుషుల జట్టు కాంస్యం దక్కించుకుంది..

జావెలిన్​ త్రో..
2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో షూటర్​ అభినవ్​ బింద్రా చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో భారత్​కు తొలి పసిడిని అందించాడు. బింద్రా గెలుపుతో అనేకమంది యువత షూటింగ్​వైపు అడుగులు వేశారు.ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​ అథ్లెటిక్స్ విభాగంలో టీమ్​ఇండియా ‘పసిడి’ ఆకలి తీర్చేశాడు అథ్లెట్​ నీరజ్​ చోప్డా. జావెలిన్​ త్రో ఫైనల్​లో 87.58మీటర్లు వేసి ‘నీరజ్​.. నీకు సలాం’ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఆ త్రో వేసిన వెంటనే నీరజ్​ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం..పారాలింపిక్స్​లోనూ భారత్​ అద్భుత ప్రదర్శనలు చేసింది. జావెలిన్​ త్రోలో దేవేంద్ర జజారియా రెండుసార్లు స్వర్ణం(2004,2016) సాధించాడు. ఇతడితో పాటు రాజేంద్రసింగ్, గిరీష నాగరాజె గౌడ, మరియప్ప తంగవేలు, దేవేంద్ర జజారియా, దీపా మాలిక్, వరుణ్ సింగ్ భాటి విశ్వక్రీడల్లో పతకాలతో చెలరేగారు. భారత్ ఘనతను పదింతలు పెరిగెలా చేసింది..ఇవి భారత దేశ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించేలా చేశాయి..ఇప్పటికీ ఎంతో మంది భారత దేశ ఘనతను పెంచెందుకు కృషి చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news