టీమిండియా వెటరన్ ఓపెనర్ షికర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలురాయిని అందుకున్న పదో భారత బ్యాటర్ గా ధావన్ రికార్డుల ఎక్కాడు. హరారే వేదికగా జింబాబ్వే తో జరిగిన తొలి వన్డేలో ధావన్ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో ధావన్ 81 పరుగులతో ఆఖరి వరకు అజయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తోలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 189 పరుగులకే కుప్పకూలింది టీమిండియా బౌలర్లలో చహార్, ప్రసీద్ కృష్ణ, అక్షర పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం 190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు శుభమాన్ గీల్(82), ధావన్(81) పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించారు.