వారికి గుడ్ న్యూస్.. ఉచితంగా రూ.2.50 లక్షలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. చాలా మంది కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అయితే కొత్తగా పెళ్లయిన జంటలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని ఇస్తోంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రూ.2 లక్షల 50 వేలు ని కేంద్రం కొత్తగా పెళ్లయిన జంటలకు ఇస్తోంది.

మీ నియోజకవర్గం ఎంపీ లేదా ఎమ్మెల్యేకు దరఖాస్తు చెయ్యాల్సి వుంది. ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలంటే ప్రాంతంలోని ప్రస్తుత ఎమ్మెల్యే లేదా ఎంపీని సంప్రదించాలి. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. పెళ్లి చేసుకునే అబ్బాయి, పెళ్లి చేసుకునే అమ్మాయి ఒకే కులానికి చెందినవారు అవ్వకూడదు. అలానే తప్పనిసరిగా హిందూ వివాహ చట్టం 1955 కింద నమోదు చేయబడాలి.

అలానే ఇది మొదటి వివాహం మాత్రమే అయ్యుండాలి. రెండవ వివాహం అయితే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందేందుకు అవ్వదు. ఏదైనా ఇతర స్కీమ్‌ ని పొందినట్లయితే ఈ స్కీమ్ మొత్తం తగ్గించబడుతుంది. రూ.50 వేలు ఏదైనా స్కీమ్ నుండి పొందుతుంటే ఈ డబ్బు మైనస్ చేస్తారు. మిగిలినది ఇస్తారు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది చూద్దాం.

కొత్తగా పెళ్లయిన వారు కుల ధృవీకరణ పత్రాన్ని ఈ దరఖాస్తుతో అటాచ్ చెయ్యాలి.
వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా సబ్మిట్ చెయ్యాలి.
భార్యాభర్తలు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి వుంది.
పైగా ఇదే మొదటి పెళ్లి అని నిరూపించుకోవాలి.
బ్యాంకు ఖాతాలో రూ.1.5 లక్షలు జమ చేస్తారు. మిగిలిన 1 లక్ష రూపాయలు మీకు FDగా వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version