చాలా మంది భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. దీనితో భవిష్యత్తు లో ఏ బాధ లేకుండా హాయిగా ఉండచ్చు. ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు.
పోస్టాఫీసు స్కీమ్స్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో పొదుపు చేస్తే రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ప్రతీ నెలా డబ్బులు వస్తాయి. అందుకే చాలా మంది వీటిల్లో డబ్బులని పెడుతూ వుంటారు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఆప్షన్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా మీకు నిర్ణీత మొత్తంలో ఆదాయం వస్తుంది.
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే కాలపరిమితి తర్వాత నెలవారీ ఆదాయం వస్తుంది. డబ్బును డిపాజిట్ చేసిన ఐదేళ్ల తర్వాత మీకు డబ్బులు వస్తాయి. దీనిలో మీరు సింగిల్, జాయింట్ అకౌంట్స్ ని ఓపెన్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు.
జాయింట్ అకౌంట్ లో అయితే గరిష్టంగా రూ.9 లక్షల పెట్టచ్చు. సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ ఈ స్కీమ్ తో వస్తుంది. రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి మొత్తం వడ్డీ రూ.59,400 వస్తుంది. ఈ డబ్బులని 12 నెలల పాటు నెలనెలా ఇస్తారు. ఇలా నెల వడ్డీ దాదాపు రూ.5వేలు వస్తుంది. సింగిల్ అకౌంట్ అయితే రూ.2,475 వస్తుంది. పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి స్కీమ్ లో చేరచ్చు.