ఆఫ్రికా నుండి కొన్ని చీతాలను ఇండియాకు తీసుకువచ్చి కూనో పార్క్ లలో ఉంచారు. కాగా గత కొంతకాలం నుండి ఈ చేతలు ఒక్కొక్కటిగా మరణించడం సంచలనంగా మారుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో ఉన్న రెండు పిల్ల చేతలు మరణించాయి. ఈ విషయాన్ని ఈ పార్క్ ను నిర్వహిస్తున్న అధికారులు తెలియచేశారు. ఈ మరణాలపై పరిశీలించిన అనంతరం అధికారులు ఈ చీతాలు ఎండలకు తట్టుకోలేక మరణించాయని ధ్రువీకరించారు. రెండు రోజుల క్రితం కూడా ఒక చేత ఇదే విధంగా మరణించింది. ఈ పార్క్ లో గత మూడు రోజుల వ్యవధిలో మూడు చేతలు చనిపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కాకుండా రెండు నెలల ముందు 3 పెద్ద చీతాలు మరణించాయి. ఆ నేషనల్ పార్క్ పై ప్రత్యేక విచారణను వేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.