తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేసి.. .రీసెంటుగా అడ్మిట్ కార్డు లను సైతం విడుదల చేశారు. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు ఈ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై తాజాగా హై కోర్ట్ లో విచారణ జరుగగా ఈ పిటిషన్ పైన పూర్తి వివరణ ఇవ్వాలని TSPSC చైర్మన్, కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సిట్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ పై కౌంటర్ ను దాఖలు చేయాలని హై కోర్ట్ ఆదేశిస్తూ… తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. మరి ఈ పిటిషన్ పైన పైన పేర్కొన్న వారందరూ ఎటువంటి వివరణ హై కోర్ట్ కు ఇవ్వనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
కాగా ఈ పరీక్షను జూన్ 11వ తేదీన జరపనున్నారు. తర్వాత సిట్ మరియు TSPSC లు ఏ నిర్ణయం తీఉస్కోనున్నాయి అన్నది చూడాలి.