పేదరికం లేని భారత్ ఏర్పాటుకు నూతన పార్లమెంటు భవనం దిక్సూచి కావాలి – చంద్రబాబు

-

నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చారిత్రాత్మకమైందని కొనియాడారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపే వారిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చంద్రబాబు ట్విట్ చేశారు. ఇలాంటి చారిత్రక కట్టడాన్ని నిర్మించినందుకు కేంద్రానికి కూడా అభినందనలు తెలిపారు.

” ఈ భవన నిర్మాణంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు. దేశ భవిష్యత్తు మార్పులు, చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలి. పేదరికం లేని భారత్ ఏర్పాటుకు కొత్త భవనం దిక్సూచి కావాలి. 2047లో దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి దేశంలో పేదలు, ధనికుల మధ్య తారతమ్యం తగ్గించేందుకు ఇదో వారధిలా పనిచేయాలి ” అని ట్వీట్ చేశారు చంద్రబాబు. ఇక కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి తమ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ను పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీలో నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news