మృతి చెందిన తల్లి శవం గుండెలపై రెండు మాసాల చిన్నారి.. తల్లి చేతి వేళ్లను కోరుకుతూ ఐదు రోజుల పాటు ఉన్న ఘటన… లూయిస్ విల్లేలోని ఓ ప్రముఖ అపార్ట్మెంటు లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… డేనియల్ వేడ్ అనే మహిళ… గత నెల 29వ తేదీన తన తల్లి ఉన్నటువంటి లూయిస్ విల్లెలోని… అపార్ట్మెంటు కు వచ్చింది. తనతో పాటు రెండు నెలల చిన్నారి మరియు తన పెద్ద కుమారుడు ని తీసుకుని తన తల్లి ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు ఆరోగ్యం గానే ఉన్న డేనియల్ వేడ్… కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆగస్టు 13న మృతి చెందింది.
దీంతో ఆ ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఏమీ తెలియని ఆ రెండు నెలల… చిన్నారి… తన తల్లి శవం పైనే పడుకుంది. ఆకలి వేసినప్పుడు తన తల్లి వేళ్ళను కొరుకుతూ… జీవనం గడిపింది. తన తల్లి మృతి చెందిన అన్న విషయం తెలియక…. చేతి వేళ్ళ నే కొరుకుతూ ఐదు రోజుల పాటు అలాగే ఉండిపోయింది ఆ చిన్నారి. అయితే ఐదు రోజులు కావడంతో… ఆ శవం వాసన రావడం మొదలు పెట్టింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళ శవాన్ని బయటికి తీశారు. శవాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని ఆ మృతిచెందిన తల్లి ఆడ్రియాన్ ను ప్రశ్నించారు పోలీసులు. అయితే…”నా చనిపోయిన కూతురికి రెండు నెలల పాప ఉంది. ఆకలితో నా కూతురి వేళ్ళను కొరుకుతూ ఈ ఐదు రోజుల పాటు ఆరోగ్యంగా ఉండగలిగింది. అందుకే తన కూతురు శవాన్ని కాల్చ లేకపోయాను. ” అని ఆండ్రియాని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఈ విషయం విన్న పోలీసులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆ చిన్న లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆండ్రియాను పేర్కొన్నారు పోలీసులు.