2019 Roundup క్రికెట్… భారత్ లాంటి దేశాల్లో ఈ పేరు చెప్తే చాలు అభిమానులకు పూనకం వస్తుంది. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది రెండు దేశాల మధ్య అంటే ఆ దేశాల అభిమానుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నా క్రికెట్ ప్రపంచకప్ మరో దేశంలో జరుగుతుంటే దాని గురించే మాట్లాడుకుంటాం. అలాంటి క్రికెట్ ఈ ఏడాది రెండు అత్యంత వరస్ట్ సంఘటనలను నమోదు చేసింది. మ్యాచ్ ఫలితాలను తలకిందులు చేసిన సంఘటనలు ఆ రెండు… ఈ ఏడాది ప్రపంచకప్ లో జరిగాయి.
ప్రపంచకప్ లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి సెమి ఫైనల్ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీం ఇండియా ఓటమి పాలైంది. దానికి కారణం ధోని కీలక సమయంలో రనౌట్ కావడమే. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీం ఇండియాను రవీంద్ర జడేజా, ధోని ద్వయం ఆదుకుంది. దాదాపు 130 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడి మ్యాచ్ ని గెలిపించే దిశగా తీసుకువెళ్ళింది. ఈ తరుణంలో 208 పరుగుల వద్ద జడేజా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే 216 పరుగుల వద్ద ధోని,
అనవసర పరుగుకి ప్రయత్నించగా… గుప్తిల్ విసిరిన త్రో కి రనౌట్ అయ్యాడు. అప్పటి వరకు మ్యాచ్ గెలుస్తాం అనుకున్న టీం ఇండియాకి ధోని రనౌట్ ఊహించని షాక్ ఇచ్చింది. క్రీజ్ లో చిరుత పులి మాదిరి పరిగెత్తే ధోని రనౌట్ కావడంతో టీం ఇండియా ఓటమి లాంచనం అయింది. అప్పటి వరకు ఆచితూచి ఆడిన ధోని 72 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో సంఘటన విషయానికి వస్తే… ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్ లో విజయం సాధించించడం. అది ఎప్పటికి క్రికెట్ అభిమానులు మరువలేనిది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 241 పరుగులు చేయగా ఆ తర్వాత స్వల్ప లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ని కివీస్ ని కట్టడి చేయగా కీలక సమయంలో మార్టిన్ గుప్తిల్ విసిరిన త్రో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్తోక్స్ బ్యాట్ కి తగిలి ఓవర్ త్రో గా నాలుగు పరుగులు వెళ్ళింది. దీనితో రెండు జట్ల స్కోర్లు సమ౦ కావడం, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై కావడంతో మ్యాచ్ లో ఫోర్లు సిక్సులు ఆధారంగా విజేతను ప్రకటించారు. ఈ రెండు ఈ ఏడాది వరస్ట్ సంఘటనలు గా క్రికెట్ ప్రపంచం గుర్తించింది.