నేడు రాజధాని ప్రాంత ఎమ్మెల్యేల కీల‌క భేటీ.. అనంత‌రం..

-

ఏపీకి మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్షాలు, రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రేపు భేటీ కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 03.30 గంటలకు నేతలు భేటీ కాబోతున్నారు. 3 రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలు, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంత రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసి , రైతులకు భరోసా ఇచ్చేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ ప్రణాళికను వైసీపీ ఎమ్మెల్యేలు మీడియాకు వివరించనున్నారు వివరించనున్నారు. కాగా, డిసెంబరు 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికోసం జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసిన అంశాల నివేదికపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న పూర్తిస్థాయి రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం, మంత్రులు సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ సమావేశం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news