గ్రేటర్ ఎన్నికల్లో స్టాంప్ పేపర్ల దోపిడీ… 20 రూపాయలది వెయ్యి…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అక్రమాలు కూడా కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో రూ.20 విలువ చేసే స్టాంప్ పేపర్ రూ.వెయ్యిపైగానే ఉంది ధర. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తమ మీద ఉన్న నేరాలను సహా ఇతర అంశాలను 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్లకు అవసరమైన అఫిడవిట్ కోసం స్టాంప్ పేపర్లను రూ.వెయ్యి చెల్లించి కూడా అభ్యర్ధులు కొనుగోలు చేస్తున్నారు.Assam: Stamp paper crisis hits Dhubri, black marketing on the rise

గత రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ లు జరగడం లేదు. దీనితో ఆ పేపర్ లు వేరే అవసరాలకు విక్రయించారు. దీంతో కొరత భారీగా పెరిగింది. రిజిస్ట్రేషన్ లు లేకపోవడంతో వాటిని పారిమితంగానే నిల్వ ఉంచారు. ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికలు రావడంతో వాటి అవసరం పెరిగింది. నామినేషన్ వేయాలి అంటే… గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రతి అభ్యర్థికి స్టాంప్ పేపర్ అవసరం వచ్చింది. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయాల్లో కూడా పెద్దగా నిల్వ చేసుకోలేదు.

దీంతో నిలువ ఉన్న పేపర్లు విల్ డీడ్, పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా ఉండటంతో వాటికి సరిపోయాయి. అదనంగా డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయాల్లోనూ లేకపోవడంతో డిమాండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నగర పరిధిలో సుమారు 11 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్టాంప్ పేపర్లు నిల్వ లేవు. దీనితో దాన్ని ఆధారంగా చేసుకుని వెయ్యి నుంచి రెండు వేల వరకు విక్రయిస్తున్నారు.