2022 కొంతమంది హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇకపోతే 2022 ఏడాదికి గానూ ఎలాంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి అనే విషయానికి వస్తే.. జనవరి నెలలో బంగార్రాజు సినిమాతో హిట్ దశ మొదలైంది. డిసెంబర్లో ధమాకా, 18 పేజీస్ సినిమాలతో హిట్ సినిమాల హవా ముగిసింది. ఇకపోతే సంక్రాంతి సీజన్ లో హీరో, రౌడీ బాయ్స్, బంగార్రాజు ఇలా చాలా చిత్రాలే వచ్చాయి. ఇందులో నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరిలో వచ్చి పర్వాలేదనిపించుకుంది.
ఆ తర్వాత డిజె టిల్లు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మార్చిలో వచ్చిన రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో విజయం సొంతం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచం గుర్తించేలా చేసింది.. ఆ తర్వాత మే నెలలో వచ్చిన ఎఫ్3 సినిమా కూడా యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా అందరిని మెప్పించింది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఆయనకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు.
అడవి శేష్ నటించిన హిట్ 2, మేజర్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా.. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా, దుల్కర్ సల్మాన్ నటించిన మృనాల్ ఠాగూర్ చిత్రాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే కార్తికేయ 2 సినిమా కూడా మరో విజయాన్ని ఇండస్ట్రీకి అందించింది. అలాగే ఒకే ఒక జీవితం గాడ్ ఫాదర్ సినిమాలు పరవాలేదనిపించుకున్నాయి. ఆ తర్వాత యశోద, గాలోడు , ఊర్వశివో రాక్షసివో, ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం ఇలా అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు తాజాగా విడుదలైన ధమాకా, 18పేజెస్ కూడా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఇవన్నీ కూడా టాలీవుడ్ చిత్రాలు కావడం గమనార్హం.