సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేపింది. పట్టణంలో యాదాద్రి టౌన్ షిప్ లో ఓ ఇంట్లో ఇటీవలే జరిగిన అంత్యక్రియలకు సుమారు 30 మంది హజరు కాగా అందులో ఒకే ఇంటికి చెందిన బంధువులలో 22 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.

ఈ క్రమంలో అప్రమతమైన అధికారులు కాలనీలో వైద్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి కరోన నిర్ధారణ అయిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ అంశం మీద జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ కరోన లక్షణాలు కల్గిన వారందరికి తగిన మెడిసిన్ అందిస్తూ సూచనలు ఇస్తూ వైద్యుల పర్య వేక్షణలో ఉంచారమని ఎవ్వరు భయ పడాల్సిన అవసరం లేదనీ పేర్కొన్నారు.